- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-EU Talks: భారత్, ఈయూ మధ్య భాగస్వామ్యంపై మోడీ ప్రశంసలు
భారత్, యూరోపియన్ యూనియన్(EU) మధ్య భాగస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సహజమైనదని అభివర్ణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, యూరోపియన్ యూనియన్(EU) మధ్య భాగస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సహజమైనదని అభివర్ణించారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాస్ డెర్ లేయన్ తో మోడీ భేటీ అయ్యారు.. ఈ ఏడాది చివరినాటికి భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదురుతుందని మోడీ అన్నారు. వివిధ అంశాలపై నిజాయితీగా, అర్థవంతమైన చర్చలు జరిపామాన్నారు. పరస్పరం ప్రయోజనం పొందే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై పని చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి లక్ష్యాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు
భారత్, ఈడీ మధ్య భాగస్వామ్యం పెంచేందుకు, వేగవంతం చేసేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నామని మోడీ అన్నారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడి, ఆవిష్కరణ, గ్రీన్ గ్రోత్, భద్రత, నైపుణ్యం సహా పలు అంశాల్లో సహకారం కోసం బ్లూప్రింట్ సిద్ధం చేశామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఫోరం అండ్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ బిజినెస్ సమ్మిట్‌ను సంయుక్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పెట్టుబడుల్లో రక్షణ కోసం చర్చించామన్నారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగంలో విశ్వసనీయమైన, సురక్షితమైన సహకారమే ఉమ్మడి ప్రాధాన్యత అని చెప్పకొచ్చారు. సెమీకండక్టర్, ఏఐ, హై పర్ఫామెన్స్ కంప్యూటింగ్, 6జీ పై సహకారాన్ని పెంచెందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. కనెక్టివిటీ రంగంలో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)ను ముందుకు తీసుకెళ్లడానికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రపంచ వాణిజ్యం, స్థిరమైన వృద్ధి, శ్రేయస్సును నడిపించే సాధనంగా ఐఎంఈసీ మారుతుందని విశ్వసిస్తున్నాని పేర్కొన్నారు.






