Bihar: బిహార్ పదో తరగతి పరీక్షలో చీటింగ్ పేరుతో దాడులు.. ఒకరు మృతి

by Shamantha N |

బిహార్ లో పదో తరగతి పరీక్షల్లో చీటింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో, విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పాలకు తెగబడ్డారు.

Bihar: బిహార్ పదో తరగతి పరీక్షలో చీటింగ్ పేరుతో దాడులు.. ఒకరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ లో పదో తరగతి పరీక్షల్లో చీటింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో, విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పాలకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. రోహ్‌తాస్‌లోని సాసారామ్‌ పట్టణంలో నిర్వహించిన పదోతరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఫిబ్రవరి 19న విద్యార్థుల మధ్య వివాదం ముదిరింది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన స్టూడెంట్లు పరస్పరం దాడులకు తెగబడ్డారు. మరింత రెచ్చిపోయిన స్టూడెంట్లు.. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురికి గాయాలు.. కాగా ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సాసారామ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు, ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్న స్థానిక మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story