North Korea: ఉత్తరకొరియా అమ్ములపొదిలో అణుజలాంతర్గామి

by Shamantha N |

ఉత్తరకొరియా అమ్ములపొదిలో అణుజలాంతర్గామి చేరింది. తమ దేశం అణుశక్తితో నడిచే జలాంతర్గామిని సిద్ధం చేస్తోందంటూ ఉత్తరకొరియా వెల్లడించింది.

North Korea: ఉత్తరకొరియా అమ్ములపొదిలో అణుజలాంతర్గామి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరకొరియా అమ్ములపొదిలో అణుజలాంతర్గామి చేరింది. తమ దేశం అణుశక్తితో నడిచే జలాంతర్గామిని సిద్ధం చేస్తోందంటూ ఉత్తరకొరియా వెల్లడించింది. ఇది దక్షిణ కొరియా, అమెరికాకు పెద్ద భద్రతా ముప్పును కలిగించే ఆయుధవ్యవస్థ. ఇకపోతే, ఆ జలాంతర్గామిని వ్యూహాత్మక గైడెడ్‌ మిసైల్‌ సబ్‌మెరైన్‌గా కిమ్ సర్కారు వర్ణించింది. యుద్ధ నౌకలను తయారు చేసే నౌకాశ్రయాలను తమ దేశ అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పరిశీలించారని అధికారులకు పేర్కొన్నారు. ఈ పరిణామంపై దక్షిణ కొరియాకు చెందిన జలాంతర్గాముల నిపుణుడు, సియోల్‌లోని హాన్‌యాంగ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ మూన్‌ కేయున్‌సిక్‌ మాట్లాడుతూ... ‘‘ఉత్తరకొరియా తయారు చేస్తున్న జలాంతర్గామి పది అణు క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యంతో, 6-7 వేల టన్నుల బరువుంటుంది. దీనితో దక్షిణ కొరియా, అమెరికాల భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. దీని తయారీకి రష్యా సహకారం అందించి ఉంటుంది. ప్రతిగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం కోసం రష్యాకు సంప్రదాయ ఆయుధాలను, సైనికులను ఉత్తర కొరియా పంపిస్తోంది’’ అని వివరించారు. మరోవైపు, అణుజలాంతర్గామి గురింతి తమకు ముందే తెలుసని యూఎస్ జాతీయ భద్రతా మండిలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ అన్నారు. ప్రస్తుతానికి, దీనికి సంబంధించిన అదనపు సమాచారం లేదన్నారు. ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వస్త్రరహితం చేయడానికి అమెరికా కట్టుబడి ఉందన్నారు.

Next Story