- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 11న ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్?.. ధీమాగా పీటీఐ పార్టీ వర్గాలు!
by Phanindra |
జూన్ 11న ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందని పీటీఐ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. పలుకేసుల్లో బుక్కయిన ఇమ్రాన్.. 2023 నుంచి జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే.

X
దిశ, నేషనల్ బ్యూరో: జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 11న బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇమ్రాన్ పార్టీకి చెందిన ప్రముఖ నేత గోహర్ అలీ ఖాన్ చెప్పారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో తనతోపాటు భార్య బుష్రా బీబీకి వేసిన శిక్షలను కొట్టేయాలంటూ ఇమ్రాన్ వేసిన పిటిషన్లపై జూన్ 11న ఇస్లామాబాద్ హైకోర్టు విచారణ జరపనుంది. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 72 ఏళ్ల ఇమ్రాన్.. 2023 నుంచి కటకటాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్-ఖాదిర్ ట్రస్టు కేసు కొట్టేస్తే.. అదే రోజున ఇమ్రాన్‌కు బెయిల్ కూడా దొరికే అవకాశం ఉందని పాకిస్తాన్ టెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) నేత అలీ ఖాన్ చెప్పారు.
Next Story






