- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Imran Khan: పహెల్గాం దాడి బాధాకరం.. పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్
పహెల్గాం ఉగ్రదాడి ఘటనపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రన్ ఖాన్ స్పందించారు. ఉగ్రదాడి విషాదకరమని అభివర్ణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి ఘటనపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran khan) స్పందించారు. ఉగ్రదాడి (Terrar attack) విషాదకరమని అభివర్ణించారు. ‘జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో టెర్రరిస్ట్ అటాక్‌లో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. బాధితులకు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎందుకంటే పుల్వామా ఆపరేషన్ జరిగినప్పుడు కూడా పూర్తి సహకారం అందించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశాం. కానీ ఎటువంటి స్పష్టమైన ఆధారాలను వారు అందించలేదు. పహెల్గాం ఘటన తర్వాత కూడా అదే జరుగుతోంది. ఘటనపై దర్యాప్తునకు బదులుగా మోడీ సర్కార్ మళ్ళీ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భారత్ ఈ ఘటనపై చెలగాటం ఆడకుండా బాధ్యతలో మెలగాలని సూచించారు. శాంతికి తాము ప్రాధాన్యత ఇస్తామని, కానీ దానిని పిరికి తనంగా భావించకూడదని తెలిపారు. భారత్ చేసే దుస్సహాసానికి తగిన విధంగా స్పందించడానికి పాక్ కు అన్ని సామర్థ్యాలూ ఉన్నాయన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం నేతృత్వంలోని భారత్ ఈ ప్రాంతానికి మాత్రమే ఇతర ప్రాంతాలకూ ముప్పేనని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో భారతీయుల అణచివేత తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు.






