- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇమ్రాన్ ఖాన్ జిందా హే..! హత్య వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి
రావల్పిండి (Rawalpindi) కారాగారంలో జైలు శిక్షను అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను ఆర్మీ చంపేసిందంటూ ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan) ప్రసారం చేస్తున్న మీడియా కథనాలు ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించాయి.

దిశ, వెబ్‌డెస్క్: రావల్పిండి (Rawalpindi) కారాగారంలో జైలు శిక్షను అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను ఆర్మీ చంపేసిందంటూ ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan) ప్రసారం చేస్తున్న మీడియా కథనాలు ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించాయి. ఇక సోషల్ మీడియాలో ఇమ్రాన్ మర్డర్ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలపై తాజాగా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ (Khawaja Asif) రియాక్ట్ అయ్యారు.
ఇమ్రాన్ ఖాన్ సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని ఖవాజా ఆసీఫ్ తెలిపారు. ఆయనను మరో జైలుకు తరలించారని మీడియాలో తీవ్ర స్థాయిలో వస్తున్న వదంతులను కొట్టిపడేశారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో కంటే ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన ఆహారం అందుతోందని, జైలులో భద్రంగా ఉన్నారని ఖవాజా ఆసీఫ్ పేర్కొన్నారు. డిసెంబర్ 2న ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతినిచ్చారు. తాజా ప్రకటనతో రావల్పిండిలోని సెంట్రల్ జైల్ వద్ద పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ మద్దతుదారులు ఎట్టకేలకు ఆందోళనను విరమించారు.






