- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఘా వర్గాల హెచ్చరిక.. నగరంలో 144 సెక్షన్ విధింపు
by GSrikanth |
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 144 సెక్షన్ విధించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 144 సెక్షన్ విధించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వీవీఐపీలే లక్ష్యంగా ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో ముంబయి పోలీసులు ఈ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ముంబయి పోలీసులు తెలిపారు.
ఆంక్షల నేపథ్యంలో నగరంలో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, పారాగ్లైడర్లు, పారా మోటార్లు, హ్యాండ్ గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్‌లను ఎగురవేయడాన్ని నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిని ఎగురవేయాలంటే పోలీసులు ముందస్తు అనుమతి తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిని సెక్షన్ 188 ప్రకారం శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Next Story






