- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొగమంచు ప్రభావం: విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు
by Malleboina Mahesh |
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు (Dense fog) కమ్ముకుంది. ఈ పరిస్థితుల కారణంగా కొన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనివల్ల విమానాలు ఆలస్యం గా నడిచే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation) వెల్లడించింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే సంబంధిత విమానయాన సంస్థల అధికారిక సమాచార మార్గాల ద్వారా ఫ్లైట్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించింది. విమానాశ్రయానికి చేరుకోవడానికి, చెక్-ఇన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అదనపు సమయం కేటాయించుకోవాలని, పొగమంచు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు విమానయాన సంస్థలు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నాయని తెలిపింది.
Next Story






