- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎబోలా విజృంభణ ఎఫెక్ట్.. ‘భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్’ వాయిదా
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే వారం న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ‘భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్’ వాయిదా పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్రికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైన ‘ఎబోలా’ (Ebola) వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళలన కలిగిస్తోంది. దీంతో వచ్చే వారం న్యూఢిల్లీలో జరగాల్సిన నాలుగో ‘భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ (India-Africa Forum Summit) వాయిదా పడింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇవాళ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆఫ్రికాలోని ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితి, ఎబోలా వైరస్ తీవ్రతపై భారత పరిపాలనా అధికారులు, ఆఫ్రికన్ యూనియన్ (AU) చైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ నేతలు 3 గంటలకు పైగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం శ్రేయస్కరం కాదని భావించి, దీనిని ఉమ్మడిగా వాయిదా వేయాలని నిర్ణయించారు.
వాస్తవానికి మే 28 నుంచి మే 31 వరకు న్యూఢిల్లీలో ఈ సదస్సు జరగాల్సి ఉంది. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ టెక్నాలజీ, స్థిరమైన అభివృద్ధి, ప్రపంచ పాలన వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఆఫ్రికా దేశాల అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీకి హాజరుకావాల్సి ఉంది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఈ సదస్సును భారత్ నిర్వహించేందుకు పూనుకుంది. వాయిదా పడిన ఈ సదస్సు నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.






