IMF: పాక్ కు ఆంక్షలు విధించిన ఐఎంఎఫ్

by Shamantha N |

పాకిస్థాన్‌కు (Pakistan) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరు చేసేందుకు ఇటీవలే ఆమెదం తెలిపింది.

IMF: పాక్ కు ఆంక్షలు విధించిన ఐఎంఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌కు (Pakistan) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరు చేసేందుకు ఇటీవలే ఆమెదం తెలిపింది. కాగా.. ఈ నిధులను మంజూరు చేయడానికి ఐఎంఎఫ్‌ పలు షరతులు విధించింది. బెయిలౌట్ ప్రోగ్రామ్ లో భాగంలా నిధులు మంజూరు చేసేందుకు 11 షరతులు విధించింది. అంతే కాకుండా భారత్‌తో ఉద్రిక్తతలు ఇంకా పెంచుకోవడం వల్ల పాక్‌కే ఎక్కువ సమస్యలు వస్తాయని చురకలు అంటించింది. ఈ ఘర్షణలు దేశంలో ఆర్థిక, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లోకి వెళ్లినప్పటికీ..ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని ఐఎంఎఫ్‌ నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం ఐఎంఎఫ్ పాకిస్థాన్‌పై ప్రస్తుతం విధించిన 11 షరతులతో మొత్తం షరతులు 50కి చేరాయి. జూన్ 2025 చివరి నాటికి ప్రోగ్రామ్ లక్ష్యాలను చేరుకోవడానికి ఐఎంఎఫ్ ఒప్పందానికి అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు పార్లమెంటరీ ఆమోదం పొందాలనే కొత్త షరతును విధించింది. అభివృద్ధి వ్యయం కోసం రూ. 1.07 ట్రిలియన్లతో సహా ఫెడరల్ బడ్జెట్ మొత్తం పరిమాణాన్ని రూ. 17.6 ట్రిలియన్లుగా చూపించింది.

రక్షణ బడ్జెట్..

ఇకపోతే, IMF నివేదిక ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ రూ. 2.414 ట్రిలియన్లుగా ఉంది. అయితే, ఇది ప్రస్తుత బడ్జెట్ రూ.252 బిలియన్లతో పోలిస్తే 12% ఎక్కువ. ఐఎంఎఫ్ అంచనాతో పోలిస్తే, ఈ నెల ప్రారంభంలో భారతదేశంతో ఘర్షణ తర్వాత ప్రభుత్వం రూ.2.5 ట్రిలియన్లు లేదా ప్రస్తుత బడ్జెట్ కన్నా 18 శాతం ఎక్కువ కేటాయించాలని సూచించింది. మరోవైపు, ఐఎంఎఫ్‌ ఇస్తున్న నిధులను పాక్‌ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదులను పోషించడానికి వినియోగిస్తోందని భారత్‌ ఇటీవల ఆరోపించింది. ఆపరేషన్‌ సిందూర్‌లో (Operation Sindoor) ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు రూ.14 కోట్ల ఇస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. పాక్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్‌ పాక్‌కు నిధులు సమకూర్చడంపై పునరాలోచించాలని కేంద్రం కోరింది. అయినప్పటికీ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పాక్‌కు 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరయ్యాయి. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్‌ ఆమోదం తెలిపింది.

Next Story