సూపర్ ఎల్‌నినో.. శీతాకాలంపై కూడా ఎఫెక్ట్? : కరువుపై ఐఎండీ తీవ్ర హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

ఇప్పటికే దేశంలో ఎల్ నినో ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతుంటే.. ఐఎండీ మరో బాంబు పేల్చింది.

సూపర్ ఎల్‌నినో.. శీతాకాలంపై కూడా ఎఫెక్ట్? : కరువుపై ఐఎండీ తీవ్ర హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇప్పటికే ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రుతుపవనాలు వచ్చినా.. వర్షాలు అంతంతమాత్రంగానే పడుతుండటం, ఉక్కపోత, వేడి పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా భారత వాతావరణ శాఖ ఎల్ నినో పై మరో బాంబు పేల్చింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పుల వల్ల సరికొత్త ఎల్ నినో ఏర్పడినట్లు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తెలిపినట్లు పేర్కొంది. ఈ ఏడాది శీతాకాలం నాటికి ఇది అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్ నినోగా మారేందుకు 63 శాతం అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

ఫలితంగా 2015 నాటి పరిస్థితులు రిపీట్ అవ్వొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా సాధారణం కంటే 10 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. వాతావరణంలో వస్తున్న ఈ కీలక మార్పులపై అందరూ జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఎల్ నినో, సూపర్ ఎల్ నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు ముప్పు పెరిగే ఛాన్సుందని, పంటల ఎదుగుదల కూడా దెబ్బతిని వ్యవసాయ ఉత్పాదకత తీవ్రంగా ప్రభావితమవుతుందన్నారు. హిందూ మహాసముద్ర డైపోల్ (Positive IOD) అనుకూలంగా ఉంటే ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు కానీ, ప్రస్తుత అంచనాల ప్రకారం దీని నుండి పెద్దగా ఉపశమనం లభించేలా లేదని తెలిపింది. భారత్ తో పాటు.. అనేక దేశాల్లో తీవ్రమైన కరువులు, నీటికొరత, పంటల వైఫల్యాలతో ఆహార భద్రత ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటి నుంచే ఆహార నిల్వలను కాపాడుకోవలసిన అవసరం ఉందని వెల్లడించింది.

Next Story