దేశంలోని ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by Geesa Chandu |   (  Updated:2024-08-25 06:29:41  IST  )

రాబోయే 24 గంటలలో.. దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.

దేశంలోని ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే 24 గంటలలో.. దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిషా రాష్ట్రాలతో సహా ఈశాన్య రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాభావ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలకు రెడ్, ఎల్లో, ఆరెంజ్అలెర్ట్ లు జారీ చేసింది.

వాతావరణ శాఖ ప్రకారం.. నరేలా, బవానా, అలీపూర్, బురారీ, కంఝావాలా, బాదిలి, జఫర్ పూర్, నజఫ్ఘడ్, రోహిణి ప్రాంతాలతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ సహా ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో రాబోయే 24 గంటలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రెడ్ అలర్ట్ ఉన్నప్రాంతాలు:

  • గుజరాత్
  • మధ్య ప్రదేశ్
  • గోవా, కొంకణ్
  • వెస్ట్ మధ్యప్రదేశ్
  • ఈస్ట్ రాజస్థాన్
  • నాగాలాండ్
  • మణిపూర్
  • మిజోరం
  • త్రిపుర

ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు:

  • ఒడిషా
  • గంగానది, వెస్ట్ బెంగాల్
  • తీర కర్నాటక
  • వెస్ట్ రాజస్థాన్
Next Story