- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రుతుపవనాలు దుసుకొస్తున్న తరుణంలో సౌత్ రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది. గత ఐదు రోజులుగా అనేక ప్రాంతాల్లో కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రుతుపవనాలు దుసుకొస్తున్న తరుణంలో సౌత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా అనేక ప్రాంతాల్లో కంటిన్యూగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి రుతుపవనాలు (Monsoons) కేరళను తాకనున్నాయి. దీంతో గోవా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (Department of Meteorology) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నుంచి ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నదులు, జలపాతాలలోకి వెళ్లవద్దని ప్రజలకు సలహా ఇచ్చింది. గత 24 గంటల్లో తీరప్రాంత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఐఎండీ ప్రకారం.. దక్షిణ గోవాలోని పోండాలో అత్యధికంగా 162 మి.మీ వర్షపాతం నమోదైంది. ధర్బందోరా తాలూకాలో 124.2 మి.మీ వర్షపాతం, మార్గోవాలో 123.4 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల్లో పరిస్థితులు విపరీతంగా ఉంటాయని ఐఎండీ రెడ్ అలర్ట్ (IMD Red Alert) జారీ చేయడంతో.. గోవా ప్రభుత్వం (Government of Goa) అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.






