- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగ మంచు.. పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. పొంగమంచు కారణంగానే ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో 129 విమానాలను రద్దు చేశారు. విమానాలు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో,

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. పొంగమంచు కారణంగానే ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో 129 విమానాలను రద్దు చేశారు. విమానాలు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ లాంటి విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి. కేవలం ఢిల్లీలోనే కాకుండా ఉదయం నుండి ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో విమానాలు రద్దు చేయబడ్డాయి. మరోవైపు పొగ మంచు కమ్ముకుని ఆగ్రాలోని తాజ్ మహల్ వ్యూ పాయింట్ వద్ద నుండి అసలు తాజ్ మహల్ కనిపించకుండా పోయింది.
దీంతో అక్కడకు వెళ్లిన పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. ఢిల్లీలోనూ మంచు కారణంగా భవనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక దట్టమైన పొగమంచు నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్కును దాటేసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆది, సోమవారాల్లో పొగమంచు తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.






