- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IMD: సెప్టెంబర్‌లో సాధారణానికి మించి వర్షపాతం.. ఐఎండీ అంచనా
దేశంలో సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. నెలవారీ సగటు వర్షపాతం 167.9 మిల్లీ మీటర్ల కంటే 109 శాతం ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిస్తే కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించొచ్చని, దక్షిణ హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌లలో జనజీవనానికి అంతరాయం కలుగుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర హెచ్చరించారు. చాలా నదులు ఉత్తరాఖండ్‌లో ఉద్భవించాయి కాబట్టి భారీ వర్షాల వల్ల వరదలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని మహానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్లేసులలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక, జూన్ 1, ఆగస్టు 31 మధ్య దేశంలో 743.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది దీర్ఘకాలిక సగటు 700.7 మిల్లీమీటర్ల కంటే 6 శాతం ఎక్కువ అని ఐఎండీ తెలిపింది. జూన్‌లో 180 మిల్లీటర్లు, జూలైలో 294.1 మిల్లీమీటర్లు, ఆగస్టులో 268.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.






