- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iltija Mufti : హిందుత్వం ఒక వ్యాధి.. పీడీపీ నేత ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేత, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ (Ilthija mufti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వను ఒక వ్యాధిగా అభివర్ణించారు. కొంత మంది వ్యక్తులు హిందువుల ఆధిపత్యాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారని కాబట్టి హిందుత్వ, హిందూయిజం వేర్వేరని తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘హిందుత్వానికి, హిందూమతానికి చాలా తేడా ఉంది. హిందుత్వం అనేది 1940లలో హిందువుల ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి వీర్ సావర్కర్ (Veer Savarkar) భారత్‌లో ద్వేష భావజాలాన్ని వ్యాప్తి చేశారు. ఇస్లాం వలె, హిందూమతం కూడా లౌకికవాదాన్ని, ప్రేమను, కరుణను పెంపొందించే మతం. దానిని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించొద్దు. జై శ్రీరామ్ నినాదం రామరాజ్యం గురించి కాదు. దానిని హత్యలతో ముడిపెట్టి హిందూ మతాన్ని వక్రీకరించడం చాలా సిగ్గుచేటు. కాబట్టి హిందుత్వం ఒక వ్యాధి’ అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముఫ్తీ వాడిన భాష చాలా అసభ్య కరంగా ఉందని బీజేపీ నేత రవీందర్ రైనా (Ravinder raina)అన్నారు. ముఫ్తీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె చాలా అవమానకరమైన పదజాలం వాడారని మండిపడ్డారు. ఇలాంటి భాష వాడకూడదని తెలిపారు. ‘రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ కించపరిచే పదాలు వాడకూడదు. ముఫ్తీ వెంటనే సారీ చెప్పాలి’ అని పేర్కొన్నారు. తర్వాత ఇల్తిజా మరొక పోస్ట్ చేశారు. ఇస్లాం పేరుతో జరుగుతున్న హింస ఇస్లామోపోబియాకి దారి తీసిందని హిందూమతంలోనే అలాంటి పరిస్థితులే ఉన్నాయని పేర్కొన్నారు.






