రణతంబోర్ టైగర్ రిజర్వ్ లోకి అక్రమంగా వాహనాలు.. సీజ్ చేసిన అధికారులు

by Geesa Chandu |

రణతంబోర్ జాతీయ పార్కులో పులుల అభయారణ్యంలోని నిషిద్ధ ప్రదేశంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి సొంత వాహనాల్లో అక్రమంగా ప్రవేశించారు.

రణతంబోర్ టైగర్ రిజర్వ్ లోకి అక్రమంగా వాహనాలు.. సీజ్ చేసిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: రణతంబోర్ జాతీయ పార్కులో పులుల అభయారణ్యం లోని నిషిద్ధ ప్రదేశంలోకి, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి సొంత వాహనాల్లో అక్రమంగా ప్రవేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో ఆ వాహనాలను అటవీశాఖ సీజ్ చేసింది. అయితే ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రంలోని రణతంబోర్ జాతీయ పార్కులోకి కొందరు వ్యక్తులు 15 ప్రైవేటు ఎస్యూవీ కార్లలో వచ్చారు. టైగర్ రిజర్వ్ మూసివున్న సమయంలో అనుమతి తీసుకోకుండా వారి వాహనాలతో అందులోకి ప్రవేశించారు. అయితే ఆ వాహనాలు పులులు సంచరిస్తున్న ప్రదేశంలోనే తిరగడంతో.. అటవీ అధికారులు వెంటనే స్పందించి, వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పర్యాటకులను.. జంగిల్ సఫారీకి అనుమతించట్లేదన్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ నిఘా ఉంటుందని, అయితే ఈ నిషిద్ధ నిఘా ప్రాంతంలోకి ఎలా ప్రవేశించారనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు అటవీ శాఖ డివిజినల్ ఆఫీసర్ రామానంద్ భాకర్ వెల్లడించారు.

Next Story