మరో ఘోరం.. అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని అక్బర్‌పూర్ కుటుక్‌పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వివాహితుడైన ఆకాశ్.. 18 ఏళ్ల భారతి.. లవ్ ఫెయిల్, అక్రమ సంబంధం కారణంగా జీవితాలను ముగించుకున్నారు. రైతు అయిన

మరో ఘోరం.. అక్రమ సంబంధంతో రెండు నిండు ప్రాణాలు బలి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని అక్బర్‌పూర్ కుటుక్‌పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వివాహితుడైన ఆకాశ్.. 18 ఏళ్ల భారతి.. లవ్ ఫెయిల్, అక్రమ సంబంధం కారణంగా జీవితాలను ముగించుకున్నారు. రైతు అయిన ఆకాశ్‌కు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. గర్భవతి అయిన అతని భార్య మైన్‌పూరిలోని తన తల్లిదండ్రుల ఇంటిలో ఉంది. అయితే ఆకాశ్, భారతి రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఫ్యామిలీ ఒత్తిడితో ఆకాశ్ వేరొకరిని వివాహం చేసుకున్నాడు. అయినా వారిద్దరి మధ్య ప్రేమ తగ్గలేదు.

ఈ విషయంపైనే జూలై 23 రాత్రి... భారతికి, తల్లికి మధ్య తీవ్ర జరిగింది. దీంతో తన కారణంగానే ఇదంతా జరుగుతుందని.. ఆకాశ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం.. జూలై 24న అతని మరణ వార్త గ్రామంలో వ్యాపించింది. ఈ వార్తతో కలత చెందిన భారతి కూడా తన ఇంట్లో ఉరివేసుకుని జీవితాన్ని ముగించుకుంది. అదే ఉదయం.. భారతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మూడు వీడియోలను పోస్ట్ చేసింది. ఇవి ఆమె మానసిక ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయి. ఉదయం 5 గంటలకు పోస్ట్ చేసిన మొదటి వీడియోలో.. ఆమె విచారకరమైన పాటలతో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. రెండవ వీడియోలో ఆమె బాధాకరమైన పాటలతో రోడ్డుపై పరిగెత్తుతూ కనిపించింది. మూడవ వీడియోలో ఒక దహన గుండం మండుతున్న దృశ్యం ఉండగా.. ఆమె బాధను సూచిస్తుంది.

Next Story