'నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా!'.. భర్తకు తొలిరాత్రే భార్య వార్నింగ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-25 09:17:31  IST  )

ఒకప్పుడు వివాహం అంటే రెండు మనుషుల మైత్రీ, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు.

నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా!.. భర్తకు తొలిరాత్రే భార్య వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు వివాహం అంటే.. రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు చూస్తే.. పెళ్లి అనే పవిత్ర బంధం పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటి దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇండోర్‌లో (Indore) సోనం భర్తను హనీమూన్‌లోనే హత్య చేసిన ఘటన మరువకముందే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో ఇటీవల పెళ్లి జరిగింది. అనంతరం నూతన వధువరువులకు పెద్దలు మొదటి రాత్రి (First night) ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషంగా గదిలోకి వెళ్లిన నిషాద్‌కు ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. సితార కత్తి పట్టుకుని వచ్చి 'నన్ను తాకితే నేను 35 ముక్కలుగా చేస్తా' అని బెదిరించింది. అనంతరం తనకు పెళ్లి ఇష్టం లేదని అమన్ వ్యక్తిని ప్రేమించినట్లు తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది. దీంతో భర్త భయంతో రాత్రంతా సోఫాలో నిద్రపోయాడు. ఈ పరిస్థితి ఇలాగే మూడు రోజుల పాటు కొనసాగింది.

ఆ తర్వాత భార్య ప్రవర్తనపై నిషాద్ కుటుంబం పంచాయితీ పెట్టినా, సమస్య పరిష్కారం కాలేదు. అలాగే, నిత్యం చాకుతో బెదిరింపులు కొనసాగిస్తూ భర్తను మానసికంగా హింసించింది. ఈ విషయంపై భర్త కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. కాగా, అమన్ అనే యువకుడు సితారకు దూరపు బంధువు. ఆమెకు వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం.

Next Story