- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: రఫేల్ కూడా నడుపుతున్నారు.. కానీ, ఆ పోస్టుల్లో నియమించరా?
భారత సైన్యంలో లీగల్ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆగ్రం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యంలో లీగల్ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆగ్రం వ్యక్తం చేసింది. రఫేల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలనే అమ్మాయిలు నడుపుతున్నప్పుడు.. లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ప్రశ్నించింది. సైన్యం (Indian Army)లోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో 4,5 ర్యాంకులు రాసిన మహిళల్ని విధుల్లోకి తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ఎయిర్ ఫోర్స్ లో మహిళలు రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి ఉన్నప్పుడు.. ఆర్మీలోని లీగల్ బ్రాంచీల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లోకి తీసుకోవడంలో కష్టమేముంది? లింగబేధంతో సంబంధం లేని పోస్టులని కేంద్రం చెప్పినప్పుడు.. మహిళలకు ఎందుకు ఎక్కువ పోస్టులు కేటాయించట్లేదు? స్త్రీ-పురుష సమానత్వం అంటే సమాన అవకాశాలు కల్పించడం కాదు.. ఎవరికి అర్హత ఉంటే వారికి అవకాశం ఇవ్వడం అని అర్థం’’ అని ధర్మాసనం పేర్కొంది. విచారణ తర్వాత ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది.
కోర్టుని ఆశ్రయించిన మహిళా అభ్యర్థులు
ఇకపోతే, భారత సైన్యం (Indian Army)లోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. అయినా వీరిని విధుల్లోకి తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పురుష అభ్యర్థులకన్నా తమకు మెరిట్ ఎక్కువగా ఉనప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని కోర్టుకు తెలిపారు. వీరి పిటిషన్ పైనే విచారణ చేపట్టిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత తీర్పుని రిజర్వ్ చేసింది.






