- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Former PM Imran Khan : యుద్ధం అంటూ జరిగితే పాక్ మాజీ ప్రధాని ఎటువైపు?
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాలు యుద్ధానికి ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులు వరుస కీలక సమావేశాలు నిర్వహిస్తుండగా... ఏ క్షణమైనా యుద్ధం ముంచుకు రావొచ్చుననే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. అయితే ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో జరుగుతున్న ఈ యుద్ధంలో భారత్ కే అన్ని దేశాలు సపోర్ట్ చేస్తుండగా.. పాక్ వెంట మాత్రం తుర్కియే, చైనా నిలవనున్నట్టు తెలుస్తోంది. కాని పాక్ కు భారత్ మాత్రమే శత్రువు కాకుండా సొంత దేశంలోనూ అనేకమంది పాక్ కుతంత్రాలను వ్యతిరేకిస్తున్నారు.
వారిలో ముఖ్యులు పాకిస్తాన్ తెహ్రీక్ ఈ-ఇన్సాఫ్(PTI) అధినేత, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pak Former PM Imran Khan). ఇమ్రాన్ ఖాన్ ముందు నుంచే భారత్ తో కయ్యానికి నో చెబుతుండగా.. యుద్ధం అంటూ జరిగితే రెండు దేశాలపై గణనీయమైన ప్రభావం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, 2019లో భారత్-పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు ఏర్పడినపుడు, అతను ఐక్యరాష్ట్ర సమితి(UNO)లో యుద్ధం జరిగితే రెండు దేశాలకూ నష్టమేనని, అణు యుద్ధం ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన దీనిని బలపరిచే విధంగా ఉంది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా పాక్ ప్రభుత్వం.. ఆర్మీ అధికారులు, ప్రతిపక్ష పార్టీలతో ఓ ముఖ్యమైన సమావేశం నిర్వహించగా.. పీటీఐ(PTI) ఆ మీటింగుకు డుమ్మా కొట్టింది.
ఈ సందర్భంగా పీటీఐ ఓ లేఖను విడుదల చేసింది. తమ పార్టీ యుద్ధాన్ని కోరుకోవడం లేదని పేర్కొంది. ఇప్పటికే దేశ ఆర్థికస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. యుద్ధం వలన అది పాతాళానికి పడిపోతుందని.. దేశ ప్రజలు తీవ్ర కరువు, కాటకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా యుద్ధం అంటూ వస్తే పీటీఐ, ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్.. యుద్ధం జరగకుండా ఆపడానికి సంప్రదింపులు, అంతర్జాతీయ సహకారం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ, యుద్ధం తప్పనిసరి అయితే మాత్రం తన మాతృభూమి పాకిస్థాన్ వైపే ఉండి, దేశ ప్రయోజనాల కోసం నిలబడతాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






