- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-పాక్ యుద్ధం జరిగితే వారంలో ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ ఔట్..తేల్చి చెప్పిన పాక్ త్రివిధ దళాధిపతులు
India-Pak: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అసువులు బాసిన అనంతరం ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: India-Pak: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అసువులు బాసిన అనంతరం ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రారంభమైంది. ఇప్పటికే పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇచ్చేందుకు భారత్ సిద్ధం అయింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం త్రివిధ దళాలకు వారి స్వేచ్ఛానుసారం నిర్ణయం తీసుకోవచ్చని ఇందులో ప్రభుత్వ ఒత్తిడి ఉండదని దేశ భద్రత కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్న తాము అంగీకరిస్తామని స్వేచ్ఛను ఇచ్చారు.
ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఒకవేళ యుద్ధం జరిగినట్లయితే, ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ముఖ్యంగా భారత్ అదేవిధంగా పాకిస్తాన్ రెండు సైన్యాలు చివరిసారిగా కార్గిల్ యుద్ధం అంటే దాదాపు 1999లో ముఖాముఖి తలపడ్డాయి.
అప్పుడు భారత్ దళాలను వెనక్కు వెళ్లగొట్టి పై చేయి సాధించింది. ఆ తర్వాత నుంచి భారత పాకిస్తాన్ దళాల మధ్య ముఖాముఖి పోరాటం జరగలేదు. . మధ్యలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ద్వారా మాత్రమే పలుమార్లు ఉగ్ర దాడులు జరిగాయి. అయితే 2016 సంవత్సరంలో భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని లక్షిత ప్రదేశాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. మళ్లీ 2019వ సంవత్సరంలో బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి అంతమైపోతుందని ఆ దేశ త్రివిధ దళాధిపతులు పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసీం మునీర్ కు తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే భారత సైన్యం చాలా బలంగా ఉందని, భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, వాటి అవసరం లేకుండానే పాకిస్థాన్ సర్వనాశనం చేయగలిగే సైనిక బలం భారత్ వద్ద ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమని తీర్చి చెప్పినట్లు సమాచారం అందుతుంది.






