- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Modi: అరెస్టైన వారి ఉద్యోగాలే పోతుంటే పీఎం, సీఎంలకు ఊరట కావాలా?: మోడీ
బిహార్ సభలో ప్రదాని మోడీ కాంగ్రెస్, ఆర్జేడీలను టార్గెట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర నేరాభియోగాలపై అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లైతే ప్రధాని సహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులను పదవి నుంచే తప్పించే బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై మోడీ ఘాటుగా స్పందించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో లేదా బెయిల్ లో ఉన్నారని అదుకే అవినీతికి వ్యతిరేకంగా తీసుకువస్తున్న బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇవాళ బిహార్ లోని (Bihar) గయాజీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని మోడీ ప్రశ్నించారు. కొంత కాలం క్రితం కొంతమంది నేతలు జైళ్ల నుంచి పైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూశామని సెటైర్లు వేశారు. తాము తీసుకువస్తున్న ఈ చట్టానికి ప్రధాని సైతం అతీతం కాదని అన్నారు.
కాగా 30 రోజుల పాటు అరెస్టు అయితే 31వ రోజు పదవి నుంచే తప్పించడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర మంత్రి అమిత్ షా బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దె దించడానికి ఇవి దోహదపడతాయని విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లును సమగ్ర పరిశీలనకు 31 మందితో కూడిన జేపీసీకి పంపాలని లోక్ సభ నిర్ణయించింది. పార్లమెంట్ శఈతాకాల సమావేశాల తొలివారం చివరి రోజున జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.






