Assam CM: నా భార్య పాక్ ఐఎస్ఐ ఏజెంట్.. నేను రా ఏజెంట్- కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

“ నా భార్య పాకిస్థాన్‌ ఐఏస్‌ఐ ఏజెంట్‌ అయితే.. నేను ఇండియన్‌ రా ఏజెంట్‌ను’అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి(Gaurav Gogoi) అన్నారు.

Assam CM: నా భార్య పాక్ ఐఎస్ఐ ఏజెంట్.. నేను రా ఏజెంట్- కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: “ నా భార్య పాకిస్థాన్‌ ఐఏస్‌ఐ ఏజెంట్‌ అయితే.. నేను ఇండియన్‌ రా ఏజెంట్‌ను’అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి(Gaurav Gogoi) అన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma), ఆరాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గౌరవ్ భార్యను ఉద్దేశించి ఐఎస్ఐ ఏజెంట్ అంటూ హిమంత చేసిన ఆరోపణలకు గౌరవ్ గొగొయి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే హిమంత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. హిమంత బిశ్వశర్మ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పించేలా ఉన్నాయని అన్నారు. ‘ నా భార్య పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ అయితే, నేను ఇండియన్‌ రా ఏజెంట్‌ని. కేసులు పెట్టడం, నా కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నాకు అభ్యంతరం లేదు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానిబే సీఎం విమర్శలు చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొత్తవేం కాదు. గతేడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నాపై, నా కుటుంబంపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేసింది. అందుకు జోర్హాట్‌ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు గట్టిగా బదులిచ్చారు.’ అని అన్నారు. అసోం ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయిందన్నారు. ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది టైం ఉందని గుర్తుచేశారు. అయినా, హిమంతకు తన పదవిని కోల్పోతారనే భయం ఉందన్నారు. ఆ భయంతోనే తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

హిమంత ఏమన్నారంటే?

సీఎం హిమంత బిశ్వ శర్మ అసోం కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయి పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన గురించి, ఆయన సతీమణి యూకే సంతతికి చెందిన ఎలిజబెత్ కోల్బర్న్ గురించి సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ ఎంపీ సతీమణికి పాకిస్థాన్‌ ఐఎస్ఐతో సంబంధాలున్నాయి. యువతను పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి తరలించి వారికి బ్రెయిన్ వాష్ చేయడం, ఉగ్రవాదం వైపు మళ్లించడం చేస్తున్నారు. అంతేకాకుండా, గత 12 ఏళ్లుగా భారత పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ అంశాలపై వివరణ ఇవ్వాల్సిందే’ అని చెప్పుకొచ్చారు. హిమంత్‌ బిశ్వశర్మ ఆరోపణలపై కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గోగోయ్‌ ఘాటుగా స్పందించారు.

Next Story