- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమాయక పౌరులపై దాడులు చేస్తే మా రెస్పాన్స్ అదే.. లోక్‌సభలో అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్
పహల్గాంలో మతం పేరు అడిగి పర్యాటకులను చంపడం దారుణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాంలో మతం పేరు అడిగి పర్యాటకులను చంపడం దారుణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇవాళ లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై ఆయన మాట్లాడుతూ.. పహల్గాం టెర్రల్ అటాక్ ఓ అమానుష ఘటనగా అభివర్ణించారు. సోమవారం ఆ ఉద్ర దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చాయని సభకు తెలిపారు. పహల్గాం అటాక్ కీలక నిందితుడు కూడా సులేమాన్ హతమయ్యాడని స్పష్టం చేశారు. లోక్‌సభ వేదికగా మన భద్రతా బలగాలు, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పహల్గాం దాడి జరిగిన ప్రాంతానికి తాను వెంటనే వెళ్లి పరిస్థితిని సమీక్షించానని పేర్కొన్నారు. అదేవిధంగా ఉగ్రమూకలకు ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని వెల్లడించారు. ఇక ఉగ్రవాదుల శిబిరాలను కూడా మట్టిలో కలిపేశామని అన్నారు. ఘటనా స్థలంలో దొరికిన తుపాకీ, బుల్లెట్లను ఎఫ్ఎస్ఎల్‌కు పంపామని గుర్తు చేశారు. ఆ ఫోరెన్సిక్ నివేదక ద్వారా అనేక విషయాలు వెలుగు చూశాయని అమిత్ షా అన్నారు.
విపక్షాలపై బిగ్ సెటైర్..
అమాయక పౌరులపై దాడులు చేస్తే.. తమ ప్రతిస్పందన గట్టిగానే ఉంటుందని అమిత్ లోక్‌సభలో అన్నారు. విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని తప్పుబట్టారు. వారు ఎలాంటి ప్రశ్నలు సభలో లెవనెత్తుతున్నారో ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. పహల్గాం దాడి బాధితులను తాను స్వయంగా కలిశానని, బాధితులను కలిసి వారి బాధలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే తాను దాడి ఘటనపై దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరపడంలో ఎన్ఐఏకు మంచి పేరు ఉందని అమిత్ షా కితాబిచ్చారు. ఉగ్రవాదులను అంతమొందించామని చెప్పగానే విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తాయని అనుకున్నా.. కానీ విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని అమిత్ షా సెటైర్లు వేశారు.
ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి..
ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయా అని విపక్ష నేత చిదంబరం ప్రశ్నించారని.. ఆయన పాక్‌కు మద్దతు మాట్లాడుతున్నా అని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారని చెప్పేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని కామెంట్ చేశారు. వారి నుంచి పాక్‌లో తయారైన పత్రాలు, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నామని ఇంత కంటే రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరం ఇలా మాట్లాడటం సమంజసం కాదని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌పై నిన్న రాజ్‌నాథ్ సింగ్ వివరంగా చెప్పారని తెలిపారు. పహల్గాం ఉద్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో నేపాల్‌కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారని సభకు వివరించారు. పహల్గాం టెర్రర్ అటాక్‌కు బదులుగా పాక్, పీవోకే పరిధిలో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడులు చేయాలని సీసీఎస్ తీసుకుంది అన్నారు. ఇక నుంచి అయినా.. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు గమనించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని అమిత్ షా హితవు పలికారు.






