- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gang Rape:హోంగార్డు జాబ్ కోసం వచ్చిన మహిళపై గ్యాంగ్ రేప్.. అంబులెన్స్ లో తరలిస్తూ ఘోరం
హోంగార్డు జాబ్ కోసం టెస్టులకు హాజరైన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ లో దారుణం జరిగింది. హోంగార్డు ఉద్యోగం కోసం వచ్చిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ (Gang Rape) కలకలం రేపింది. బోధ్ గయలోని బిహార్ (Bihar) మిలిటరీ పోలీస్ మైదానంలో ఈ నెల 24న హోంగార్డు రిక్రూట్మెంట్ డ్రైవ్ (Home Guard Drive) జరిగింది. ఈ సందర్భంగా ఫిజికల్ టెస్టుల సమయంలో 26 ఏళ్ల ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. గమనించిన అధికారులు వెంటనే ఆమెను ఘటన స్థలంలో ఉంచిన అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ లోపల పలువురు తనపై అత్యాచారం చేశారని బాధిత మహిళ ఆరోపించింది. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారంగా మారింది. ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటనలు తనకు పాక్షికంగా గుర్తున్నాయని తనపై ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో బోధ్ గయ పోలీస్ లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఉన్నతాధికారులు సిట్, ఫోరెన్సిక్ బృందాని నియమించారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గంటల్లోనే అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, అంబులెన్స్ టెక్నీషియన్ అజిత్ కుమార్ లను అనుమానితుల కింద పోలీసులు అరెస్టు చేశారు. అంబులెన్స్ ప్రయాణించిన మార్గంలో సీసీ టీపీ ఫుటేజ్ లను అధికారులు పరిశీలిస్తున్నారు.
పొలిటికల్ దుమారం:
కాగా ఈ ఘటనపై లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ (Chirag Paswan) విమర్శలు గుప్పించారు. బిహార్ లో అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని నితీశ్ కుమార్ సర్కార్ కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానని హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కాగా త్వరలో బిహార్ లో ఎన్నికలు జరగనున్న వేళ బిహార్ లో వరుస నేరాలు అధికార ఎన్టీయే కూటమికి ఇబ్బందిగా మారింది. ఇంతలో అధికార కూటమిలో ఉన్న చిరాగ్ పాశ్వాన్ నితీశ్ కుమార్ కు మద్దతుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Read More : మరో ఘోరం.. నాలుగేళ్లుగా కూతురిపై అత్యాచారం.. గర్భవతిని చేసిన తండ్రి.. ఇదేం శిక్ష??






