- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IAS పూరన్ కుమార్ ఆత్మహత్య.. డీజీపీపై హర్యానా సర్కార్ వేటు
ఐఏఎస్ పూరన్ కుమార్ (IAS Puran Kumar) ఆత్మహత్య కేసులో సంచనల పరిణామం చోటచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ పూరన్ కుమార్ (IAS Puran Kumar) ఆత్మహత్య కేసులో సంచనల పరిణామం చోటచేసుకుంది. ఈ మేరకు అక్టోబర్ నెలలో సెలువుపై వెళ్లి తిరిగి విధుల్లో జాయిన్ అయిన డీజీపీ శత్రుజీత్ కపూర్ (DGP Shatrujeet Kapoor)ను బాధ్యతల నుంచి తప్పిస్తూ హర్యానా ప్రభుత్వం (Haryana Government) కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, 2001 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ అక్టోబర్ 7న చండీఘర్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆయన వదిలివేసిన 9 పేజీల సూసైడ్ నోట్‌లో డీజీపీ శత్రుజీత్ కపూర్, అప్పటి రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా సహా పలువురు సీనియర్ అధికారులు తనపై కుల వివక్ష, మానసిక వేధింపులు, ప్రజల ముందు అవమానాలు, వృత్తిపరంగా తనను టార్చర్ చేశారంటూ ఆరోపించారు. దీంతో పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ పి కుమార్ నిందిత అధికారులపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయమైన దర్యాప్తు హామీ ఇచ్చిన తర్వాతనే పోస్ట్‌మార్టంకు అనుమతినిచ్చారు.
ఈ ఘటనపై స్పందించిన హర్యానా సర్కార్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాను బదిలీ చేసి, డీజీపీ శత్రుజిత్ కపూర్‌ను సెలవుపై పంపారు. ఆయన స్థానంలో ఓపీ సింగ్ (OP Singh)కు తాత్కాలిక డీజీపీ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే, తాజాగా కపూర్ రెండు నెలల సెలవు నేటితో ముగిసిన నేపథ్యంలో డీజీపీ పదవి నుంచి ఆయనను అధికారికంగా తొలగించారు. పూరన్ కుమార్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు కొనసాగుతోంది.






