- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఐఏఎస్ మూడోపెళ్లి.. అసలు విషయం తెలిస్తే ఆశ్చపోతారు
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారి మూడో పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. గతంలో అతని ఇద్దరి భార్యల బ్యాగ్రౌండే ఇందుకు ప్రధాన కారణం.

దిశ, వెబ్‌డెస్క్: ఒక్కపెళ్లి కావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి మూడుపెళ్లిళ్లు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ మూడోసారి వివాహం చేసుకోవడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆయన వివాహం చేసుకున్న ముగ్గురు భార్యలు కూడా ఐఏఎస్ అధికారులే కావడం గమనార్హం. ఫిబ్రవరి 11న కునో నేషనల్ పార్క్‌లో 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అంకితా థాక్రేను ఆయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అంకిత రాష్ట్ర పరిపాలనా సేవల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
UPSCలో ఆల్ ఇండియా 13వ ర్యాంకు
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన అవీ ప్రసాద్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఆయన తాత తాంబేశ్వర్ ప్రసాద్ (బచ్చా బాబు) మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అవీ ప్రసాద్ 2013లో ఐపీఎస్‌కు ఎంపికవ్వగా, ఆ మరుసటి ఏడాదే 2014లో UPSCలో ఆల్ ఇండియా 13వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారి అయ్యారు.
ఇద్దరు భార్యలూ కలెక్టర్లే..
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన మొదట ఐఏఎస్ అధికారిణి రిజు బాఫ్నాను వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అయితే.. కొన్ని ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రిజు బాఫ్నా మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
మొదటి భార్యతో విడిపోయిన అనంతరం అవీ ప్రసాద్ 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత మిషా సింగ్ మధ్యప్రదేశ్ కేడర్‌కు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ కూడా విడిపోయారు. ప్రస్తుతం మిషా సింగ్ రత్లాం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వరుసగా ముగ్గురు ఐఏఎస్ అధికారిణులనే పెళ్లి చేసుకోవడం, అందులోనూ ఇద్దరు మాజీ భార్యలు అదే రాష్ట్రంలో కలెక్టర్లుగా పనిచేస్తుండటంతో అవీ ప్రసాద్ వివాహం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.






