- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ అక్కను చంపుతున్నా రికార్డు చేస్కో: కాజల్ హత్యకేసులో సంచలన విషయాలు
ఢిల్లీ పోలీస్ విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి(27).. గర్భిణిగా ఉన్నప్పుడే తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పోలీస్ విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి(27).. గర్భిణిగా ఉన్నప్పుడే తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈనెల 22న ఆమెను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో క్లర్క్ గా పనిచేస్తున్న భర్త అంకుర్ డంబెల్స్ తో కొట్టి చంపాడు. కుటుంబ ఆర్థిక విషయాల్లో తలెత్తిన గొడవల్లో అంకుర్ కోపంతో తన భార్యను చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాజల్ హత్యకు ఆర్థిక విషయాలే కారణమా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కాజల్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
కాజల్ సోదరుడు నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. తన అక్కను చంపేముందు అంకుర్ తనకు ఫోన్ చేసి ఆమెను చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు. అంతకంటే ముందే తన అక్క తనకు కాల్ చేసి.. అంకుర్ తనను తీవ్రంగా వేధిస్తున్నట్లు చెప్పింది. వెంటనే అంకుర్ తన అక్క ఫోన్ లాక్కొని.. దీనిని రికార్డ్ చేసి పెట్టుకో.. పోలీసులకు ఆధారాలుగా పనికొస్తాయి.. మీ అక్కను చంపుతున్నానని చెప్పాడన్నాడు. వద్దని ఎంత వేడుకున్నా వినలేదని, తన అక్క ప్రాణాన్ని బలితీసుకున్నాడని వాపోయాడు. ఐదురోజులపాటు ప్రాణాలతో పోరాడిన తర్వాత కాజల్ చనిపోయిందని, గాజియాబాద్ ఆస్పత్రికి వెళ్లి చూసుకోవాలని అంకుర్ కాల్ చేసి చెప్పాడు.
పోలీసులకు దీనిపై సమాచారమిచ్చి ఆస్పత్రికి వెళ్లగా.. గర్భంలో ఉన్న బిడ్డ సహా తన అక్క చనిపోయిందని ఏడ్చాడు. తల్లి మాట్లాడుతూ.. 2023లో కాజల్ - అంకుర్ లకు వివాహం జరిపించామని, ఆ సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చామన్నారు. కానీ అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారని ఆరోపించింది.






