ఐఏఎఫ్ డ్రోన్ ప్రమాదం.. జైసల్మేర్ సమీపంలో ఫోర్స్‌డ్ ల్యాండింగ్

by Kema Shiva Kumar |

భారత వాయు దళానికి చెందిన ఒక అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (UAV/డ్రోన్) రొటీన్ శిక్షణా మిషన్ సమయంలో ఇంజన్ లోపం కారణంగా రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని రాంగఢ్ సమీపంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఖాళీ పొలంలో ఫోర్స్‌డ్ ల్యాండింగ్ చేసింది.

ఐఏఎఫ్ డ్రోన్ ప్రమాదం.. జైసల్మేర్ సమీపంలో ఫోర్స్‌డ్ ల్యాండింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వాయు దళానికి చెందిన ఒక అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (UAV/డ్రోన్) రొటీన్ శిక్షణా మిషన్ సమయంలో ఇంజన్ లోపం కారణంగా రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని రాంగఢ్ సమీపంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఖాళీ పొలంలో ఫోర్స్‌డ్ ల్యాండింగ్ చేసింది. అయితే, ముందుగా ఆ డ్రోన్‌ను స్థానికులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించగా, రాంగఢ్ పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ ప్రేమ్‌శంకర్ నేతృత్వంలో బృందం ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. తర్వాత ఐఏఎఫ్ అధికారులు వచ్చి డ్రోన్‌ను తమ అదుపులోకి తీసుకుని, పరీక్షల నిమిత్తం టెక్నికల్ ల్యాబ్‌కు తరలించారు. డ్రోన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story