- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IAEA : అమెరికా దాడిలో ఫోర్డో అణు కేంద్రానికి భారీ నష్టం.. ఐఏఈఏ వెల్లడి
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత స్థితిగతులపై ఐఏఈఏ చీఫ్ గ్రాస్సీ ప్రకటన చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ప్రస్తుత స్థితిగతులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) చీఫ్ రాఫెల్ గ్రాస్సీ (Raffel grassy) కీలక ప్రకటన చేశారు. యూఎస్ దాడుల్లో ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం జరగొచ్చని తెలిపారు. అయితే దానిని ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. ఐఏఈఏ గవర్నర్ల బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. భూమిలోకి చొచ్చుకుపోయే మందుగుండు సామగ్రి పోర్డో సైట్ వద్ద కనిపిస్తుందన్నారు. దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాల మోతాదు, అలాగే సెంట్రిఫ్యూజ్‌లు తీవ్ర స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల అధిక నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. బస్టర్ బాంబులు న్యూక్లియర్ కేంద్రాన్ని తాకినట్టు ధ్రువీకరించారు. కాగా, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయగా వాటికి భారీ నష్టం జరిగిందనే కథనాలు వెలువడుతున్న వేళ రాఫెల్ గ్రాస్సీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఫోర్డో సైట్‌పై ఇజ్రాయెల్ దాడి
అమెరికా దాడులు జరిగిన తర్వాత ఇజ్రాయెల్ సైతం ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు తెలుస్తోంది. అమెరికా దాడి చేసిన ప్రదేశంలోనే ఈ దాడి జరిగిందని ఇరాన్‌కు చెందిన పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడి వల్ల అక్కడ నివసిస్తున్న నివాసితులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపాయి.






