CJI: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు విషయం పరిశీలిస్తానన్న సీజేఐ

by S Gopi |

ఈ అంశానికి సంబంధించి విచక్షణారహితంగా వీధి కుక్కలను చంపకుండా గతంలో కోర్టు తీర్పును ఓ న్యాయవాది సీజేఐ ముందు ప్రస్తావించారు

CJI: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు విషయం పరిశీలిస్తానన్న సీజేఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో వీధికుక్కలను నిషేధించాలని ఇచ్చిన తీర్పును పునఃపరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశానికి సంబంధించి విచక్షణారహితంగా వీధి కుక్కలను చంపకుండా గతంలో ఇచ్చిన కోర్టు తీర్పును ఓ న్యాయవాది సీజేఐ ముందు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఆయన, ఇతర న్యాయమూర్తుల ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. కాబట్టి ఆ ఉత్తర్వులను పరిశీలిస్తామని అన్నారు. వివిధ వర్గాల నుంచి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కుక్కల దాడులు, రాబిస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, నివాస ప్రాంతాల నుంచి అన్ని వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో వీధి కుక్కల కారణంగా రేబిస్ సోకి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. దీన్ని అడ్డుకునేందుకు సంస్థలేవైనా ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆదేశాలపై జంతు ప్రేమికులు, సంస్థలు వేసే పిటిషన్లను విచారించమని, కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని స్పష్టం చేసింది. అలాగే, మరో ఎనిమిది నెలల్లోగా వీధి కుక్కల కోసం 5,000 వీధి కుక్కల షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Next Story