- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JD Vance: అమెరికన్లు ఎక్కువ మంది పిల్లలను కనాలి- జేడీ వాన్స్
కుటుంబ వృద్ధిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో జరిగిన నేషనల్ మార్చ్ ఫర్ లైఫ్ ర్యాలీలో ఉపాధ్యక్షుడిగా ఆయన తొలి ప్రసంగం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కుటుంబ వృద్ధిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో జరిగిన నేషనల్ మార్చ్ ఫర్ లైఫ్ ర్యాలీలో ఉపాధ్యక్షుడిగా ఆయన తొలి ప్రసంగం చేశారు. యాంటీ అబార్షన్ (Anti-Abortion) ర్యాలీలో పాల్గొన్న వాన్స్ (JD Vance) మాట్లాడుతూ.. అమెరికాలో పిల్లల సంఖ్య పెరిగాలని ఆకాంక్షించారు. అమెరికాలో పిల్లల సంఖ్య పెరగాలని, అందుకు అమెరికన్లు ఎక్కువమంది పిల్లల్ని కనాలని తాను కోరుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తంచేశారు. జీవితానికి విలువనిచ్చే సంస్కృతిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబాలను ఆదుకోవడానికి, పిల్లలను పెంచడానికి అమెరికా ప్రభుత్వం మరింత సాయం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అబార్షన్‌లను ప్రోత్సహించడం ద్వారా కొన్నితరాలు భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. దేశ అభివృద్ధిని, జాతీయ ఆదాయాన్ని జీడీపీతో కాకుండా దేశంలో అభివృద్ధి చెందుతున్న, ఆరోగ్యకరమైన కుటుంబాలను ఏర్పాటుచేసుకుంటున్న వ్యక్తుల సామర్థ్యంతో కొలవాలని సూచించారు. అంతేకాకుండా జేడీవాన్స్ అతని భార్య ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలతో కలిసి.. ప్రేమను ఎంచుకోండి.. జీవితాన్ని ఎంచుకోండి అనే ప్లకార్డులు పట్టుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ట్రంప్ పై ప్రశంసలు
అమెరికా జనాభా పెరిగేందుకు మద్దతు ఇచ్చే విధానాలను ప్రోత్సహించడానికి ట్రంప్ గతంలో చేసిన ప్రయత్నాలపై వాన్స్ ప్రశంసలు కురిపించాడు. భావితరాలపై ఇప్పటివారికి ఉండాల్సిన బాధ్యతను గుర్తించడంలో ప్రస్తుత సమాజం విఫలమవుతోందని వాన్స్ ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికాలో పుట్టబోయే బిడ్డలను రక్షించడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. తమ పిల్లలను ఆనందంగా ఈ ప్రపంచంలోకి ఆహ్వానించే యువతను దేశం కోరుకుంటుందని వాన్స్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో.. ఆయన మాట్లాడిన వీడియోను వాన్స్ విడుదల చేశారు. గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి తాను పూర్తి అనుకూలం కాదని.. దానికి తాను ఎప్పటికీ మద్దతివ్వనని ట్రంప్ అన్నారు. ఎనిమిది, తొమ్మిది నెలల్లో గర్భవిచ్ఛిత్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు. అది ప్రమాదకరం కాబట్టి నెలలు నిండిన తరువాత చేసే అబార్షన్‌లను తాను ప్రోత్సహించనని ట్రంప్ స్పష్టంచేశారు.






