- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటమికి పూర్తి బాధ్యత నాదే : ప్రశాంత్ కిషోర్
by Muthe.Rajitha |
భారత్ లో ఫేమస్ పొలిటికల్, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో చిత్తుగా ఒదిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో ఫేమస్ పొలిటికల్, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో చిత్తుగా ఒదిన సంగతి తెలిసిందే. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. మేం నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ, విఫలమయ్యామని అన్నారు. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగిందని తెలిపారు. ఓటమిని ఒప్పుకోవడంలో తనకు మొహమాటం లేదని పేర్కొన్నారు. తాము అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించామని పీకే చెప్పుకొచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొని, ప్రజల ముందుకు వస్తామని తెలియజేశారు.
Next Story






