PM Modi : ఆయన కోసం ట్రంప్ ఆహ్వానాన్ని సైతం తిరస్కరించా.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌లో నేడు జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PM Modi : ఆయన కోసం ట్రంప్ ఆహ్వానాన్ని సైతం తిరస్కరించా.. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌లో నేడు జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలో బీజేపీ(BJP) ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తనను వాషింగ్టన్‌కు ఆహ్వానించినా తాను తిరస్కరించినట్టు పేర్కొన్నారు. ఒడిశాలో జగన్నాథుడి దర్శనం ఉందని.. మీ లంచ్ ఆహ్వానం కంటే తనకు పూరీ జగన్నాథు(Puri Jagannatha Swamy)డి సేవనే ముఖ్యమని చెప్పానని అన్నారు.

జగన్నాథ దేవాలయంలో నాలుగు ద్వారాలు తెరవడం, రత్న భండార్ పునఃప్రారంభం వంటి పనులతోపాటు పొగిడి, రూ. 18,600 కోట్లతో 105 అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ ఈ సభ నుంచే ప్రారంభించి.. "ఒడిశా విజన్ డాక్యుమెంట్"ను విడుదల చేశారు. "జై జగన్నాథ్"తో తన ప్రసంగం మొదలుపెట్టి, ఒడియా భాషలో "జుహార్" అని పిలిచి ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించిన మోడీ.. రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు, రైల్వే, గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులను ప్రకటించారు.

Next Story