- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను అడుక్కోవడమేంటి? ట్రంప్‌కు మెలొనీ స్ట్రాంగ్ కౌంటర్
నాతో ఫొటో కోసం ఇటలీ పీఎం మెలొనీ ప్రాధేయపడిందని ట్రంప్ అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆమె.. అవన్నీ కట్టుకథలు.. నేను అడుక్కోవడమేంటి? అంటూ మండిపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: తనతో ఫొటో కావాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ బతిమిలాడిందని, ఆమె అలా ప్రాధేయపడటంతోనే జీ7 సందర్భంగా మెలొనీతో కలిసి ఫొటో దిగానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో ఉన్న ఆయన.. ఇటలీకి చెందిన లా7 అనే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమెతో తాను మాట్లాడటంతో చాలా సంతోషించినట్లు కనిపించిందన్నారు. ‘నేను తనతో మాట్లాడే సరికి చాలా సంతోషించినట్లుంది. నాతో కలిసి ఒక ఫొటో దిగేందుకు చాలా ప్రయత్నించింది. ఫొటోకు నేను ఒప్పుకునేవాడని కాదు. కానీ పాపం అనిపించి ఫొటో తీసుకున్నా’ అని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్‌ను లా7 విడుదల చేసింది. ఈ వ్యాఖ్యలను మెలొనీ తీవ్రంగా ఖండించారు. ‘ట్రంప్ చెప్పిందంతా కట్టుకథే. అది విని నేను షాకయ్యా. తన మిత్రదేశాలతో యూఎస్ ప్రెసిడెంట్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో నాకసలు అర్థమే కావం లేదు. ఇదేం ఆయనకు ఫస్ట్ టైం కూడా కాదు’ అని విమర్శించింది. మిత్రులతో కఠినంగా వ్యవహరించే ట్రంప్.. యూరప్, యూఎస్ శత్రుదేశాల అధినేతలతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించడం కూడా చాలా నిరాశ కలిగిస్తోందన్నారు. ‘ఒక్క విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. నేను కానీ, ఇటలీ కానీ.. ఎప్పుటికీ ప్రాధేయపడటం జరగదు’ అని ఆమె తేల్చిచెప్పారు.






