- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tushar Gandhi : బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు భయపడను : గాంధీ మనవడు
గాంధీ మనవడు తుషార్ గాంధీ(Tushar Gnadhi) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : గాంధీ మనవడు తుషార్ గాంధీ(Tushar Gnadhi) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) కు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ.. ఈ దేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ అత్యంత ప్రమాదకరం అన్నారు. దేశ ప్రజల మనసులను ఇవి విషపూరితం చేస్తున్నాయని, దేశానికి అంతర్గత శత్రువులు ఇవేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తుషార్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ మండిపడుతున్నాయి. తక్షణమే తుషార్ గాంధీ తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమ గౌరవానికి భంగం కలిగేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని సంఘ్ పరివార్ నేతలు, బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటానని, ఎవ్వరికీ తాను భయపడేది లేదని, క్షమాపణ చెప్పబోనని తుషార్ గాంధీ స్పష్టం చేశారు. ఇలాంటప్పుడే ద్రోహులను బయటికి తీసుకు రావాలన్న తన పట్టుదలకు మరింత బలం చేకూరుతుందని, ఇది తనకు మరింత శక్తిని ఇస్తోందని తెలియజేశారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తుషార్ వ్యాఖ్యలు పెను దూమరాన్ని రేపుతున్నాయి.






