Kejriwal: నేను బనియా.. పథకాలకు డబ్బులు అరేంజ్ చేయగలను- కేజ్రీవాల్

by Shamantha N |

త్వరలోనే ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kejriwal:  నేను బనియా.. పథకాలకు డబ్బులు అరేంజ్ చేయగలను- కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బనియా అని.. సంక్షేమ పథకాలకు వనరులు ఎలా ఏర్పాటు చేయాలో తెలుని అన్నారు. పాలం, మటియాలా, బిజ్వాసన్ లలో జరిగిన బహిరంగ సభల్లో కేజ్రీవాల్ ప్రసంగించారు. "డబ్బు ఎక్కడి నుండి వస్తుందని అందరూ అడుగుతారు. నేను బనియాను. అన్ని పథకాలకు డబ్బులు అఱేంజ్ చేయగలను. వనరులను ఎలా వినియోగించాలో నాకు తెలుసు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు గణితం తెలుసు. నేను డబ్బు ఏర్పాటు చేస్తాను" అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్, నీరు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సంక్షేమ పథకాల గురించి ప్రశ్నలు, విమర్శలకు ఆయనకు సమాధానమిచ్చారు. కేజ్రీవాల్ జాట్ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు. ఢిల్లీలోని జాట్ సమాజం ఎదుర్కొంటున్న "అసమానత"ను ఎత్తిచూపారు, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం అందించే ఓబీసీ(OBC) ప్రయోజనాల నుండి వారిని మినహాయించడం అన్యాయమని అన్నారు. జాట్ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ ఎన్నికల ఎత్తుగడగా అని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా పరిష్కరించలేదు కానీ.. ఎన్నికలురాగానే జాట్ల డిమాండ్లు గుర్తుకు వస్తున్నాయని ఆరోపించారు. ఆప్ గత చరిత్రను నమ్మాలని ఓటర్లను కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆప్ సంక్షేమ పథకాలను నిలిపివేయాలని యోచిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.

మోడీకి కేజ్రీవాల్ లేఖ

రుణమాఫీ అంశంపై కేజ్రీవాల్ ప్రధాని మోడీకి(PM Modi) లేఖ రాశారు. రుణ మాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. దాని వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి పేర్కొన్నారు. ‘‘బిలియనీర్ల తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది. వారికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. దీంతో సామాన్యులపై అధిక పన్ను భారాన్ని మోయలేకపోతున్నారు. బిలియనీర్లకు మాత్రం ప్రయోజనం చేకూరుతోంది. పౌరులు తమ జీతాల నుంచి సగాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తుంటే.. మోడీ సర్కారు మాత్రం ధనవంతులకు రుణాలు మాఫీ చేస్తోంది’’ అని కేజ్రీవాల్‌ మీడియాతో అన్నారు. సామాన్యుల గృహ, వాహన, ఇతర రుణాలను కేంద్రం ఎందుకు మాఫీ చేయట్లేదని ప్రశ్నించారు. బిలియనీర్లకు రుణమాఫీ అనేది భారీ కుంభకోణం. దీనికి ముగింపు పలికే సమయం వచ్చిందన్నారు. కాగా..ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుండగా.. 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story