తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కంటిన్యూ.. వీసీకే చీఫ్‌ను కలవనున్న విజయ్‌

by Prasad Jukanti |

తమిళనాడు రాజకీయాల్లో పార్టీల మధ్య పొత్తుపై ఏకాభిప్రాయం రావడం లేదు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసమైన మెజారిటీ కూడగట్టుకోవడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కంటిన్యూ.. వీసీకే చీఫ్‌ను కలవనున్న విజయ్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సినిమా రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ ఇప్పుడు పూటకో ట్విస్ట్ తో అసలైన రాజకీయం ఫేస్ చేస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీ చూపించడంలో సమస్యలను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించానని నిన్న గవర్నర్ వద్దకు వెళ్లినా చివరి నిమిషంలో జరిగిన హైడ్రామాతో ప్రమాణ స్వీకారానికి లోక్ భవన్ అంగీకరించలేదు. దీంతో మరోసారి మెజారిటీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన విజయ్ ఇవాళ వీసీకే పార్టీ అధినేత తోల్. తిరుమావళవన్ (Thol. Thirumavalavan) ను కలవనున్నట్లు తెలుస్తోంది. తమ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని వీసీకేను విజయ్ కోరనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పళనిస్వామి సైతం పావులు కదుపుతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

పార్టీ కార్యాలయానికి టీవీకే ప్రధాన కార్యదర్శి:

రాజకీయ అనిశ్చితి నడుమ తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యను కూడగట్టేందుకు పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, తదుపరి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో పలువురు ఏఐఏడీఎంకే నాయకులు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై వారు తమ పార్టీలో చర్చించనున్నారు.

Next Story