ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త రియాక్షన్ వైరల్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-17 13:53:25  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య..  భర్త రియాక్షన్ వైరల్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. హనీమూన్ పేరుతో తీసుకెళ్లిన భర్తను అతి కిరాతకంగా చంపించేసింది. ఈ దారుణమైన ఘటన గురించి ఇంకా మరవక ముందే దేశంలో ఎక్కడో ఓ చోట వివాహ బంధాన్ని ఎగతాళి చేసే ఇలాంటి ఘటనలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బదౌన్‌కు చెందిన సునీల్‌కు ఇటీవల వివాహం జరిగింది. పెళ్లయిన పది రోజులకే ప్రియుడితో నవ వదువు వెళ్ళిపోయింది. తర్వాత ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం అయింది. ఈ క్రమంలో ప్రియుడితో ఆమె వెళ్లిపోయేందుకు భర్త అంగీకరించాడు. ఈ తరుణంలో అతను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. హమ్మయ్య.. ఇటీవల హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులా తనది మారలేదని బతికిపోయానంటూ సునీల్ వ్యాఖ్యానించారు.

Next Story