- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: చట్టబద్ధమైన వివాహబంధంలో పుట్టిన పిల్లలకు తండ్రి భర్తే
చట్టబద్దమైన వివాహ బంధంలో పుట్టిన పిల్లలకు తండ్రిగా భర్తే అవుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పిల్లలు దంపతుల చట్టబద్ధమైన సంతానం అని వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: చట్టబద్దమైన వివాహ బంధంలో పుట్టిన పిల్లలకు తండ్రిగా భర్తే అవుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పిల్లలు దంపతుల చట్టబద్ధమైన సంతానం అని వెల్లడించింది. కేరళకు చెందిన ఓ మహిళ తన కుమారుడి నిజమైన తండ్రి ఎవరో తేల్చేందుకు డీఎన్ఏ (DNA) పరీక్షను కోరుతూ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ సందర్భంగానే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత, పితృత్వం అనేవి వేర్వేరు భావనలు అని తెలిపింది. భారతీయ సాక్ష్యాల చట్టం, 1872లోని సెక్షన్ 112 ప్రకారం చట్టబద్ధత పితృత్వాన్ని నిర్ణయిస్తుందని గుర్తుచేసింది. దీంతో అధికారికంగా తండ్రి పేరులో మహిళ మాజీ భర్త పేరే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చేసింది. అవసరం అయితే తన కుమారుడికి డీఎన్ఏ టెస్టు చేయించి.. తండ్రి ఎవరో తేల్చాలని మహిళ కోరిన వాదనను తోసిపుచ్చింది.
కేసు ఏంటంటే?
కేరళకు చెందిన ఓ మహిళ 1991లో వివాహం చేసుకుంది. ఆమెకు 2001లో ఒక కుమారుడు జన్మించాడు. అయితే, కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషన్ జన్మధ్రువపత్రంలో బాలుడి తండ్రి స్థానంలో ఆమె భర్త పేరునే నమోదు చేసింది. అయితే వారి మధ్య విభేదాల కారణంగా 2003లో ఈ జంట విడివిడిగా జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దికాలానికే వారు విడాకుల కోసం ఉమ్మడి దరఖాస్తును దాఖలు చేశారు. 2006లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. డివోర్స్ తర్వాత మహిళ మున్సిపల్ కార్పొరేషన్‌ను సంప్రదించి జనన రిజిస్టర్‌లో మరొక వ్యక్తి పేరును "తండ్రి"గా నమోదు చేయమని అధికారులను కోరింది. తన బిడ్డకు అసలైన తండ్రి అతనేనని చెప్పుకొచ్చింది. అతనితో వివాహేతర బంధం ద్వారా బిడ్డను కన్నానని పేర్కొంది. అయితే, అలా ఎప్పుడుపడితే అప్పుడు తండ్రి పేరు మార్చడానికి సాధ్యం కాదని.. కోర్టు ఆదేశిస్తేనే అలా చేయగలమని కార్పొరేషన్ తెలిపింది. దీంతో, ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసులోనే కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.






