భర్త ఫోన్ చోరీ కేసు.. బయటపడ్డ భార్య ఎఫైర్.. వందల కొద్దీ సెక్స్ వీడియోలతో..

by Sujitha Rachapalli |

ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంటికి వెళ్తుండగా ఫోన్ చోరీ చేశారు దుండగులు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి లాక్కున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం బయటపడింది. అతని

Turn on these settings on your mobile phone to stay safe during India-Pakistan tensions telugu news
X

Viral Video: భారత్ - పాక్ ఉద్రిక్తత వేళ మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే సురక్షితంగా ఉంటారు..ఎలాగంటే?

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంటికి వెళ్తుండగా ఫోన్ చోరీ చేశారు దుండగులు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి లాక్కున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం బయటపడింది. అతని భార్య (25) తన ప్రేమికుడితో ఉన్న సన్నిహిత ఫోటోలను.. తన ఫోన్‌లో రహస్యంగా బదిలీ చేసుకున్నాడు భర్త. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె.. ఆ ఫోటోలను తొలగించడానికి ఈ ఫోన్ దొంగతనాన్ని ప్లాన్ చేసింది. కాగా ఆమె భర్తకు తన వివాహేతర సంబంధం గురించి మూడు నెలల క్రితం తెలిసింది.

సీసీటీవీ ఫుటేజ్, స్కూటర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా పోలీసులు దొంగ అంకిత్ గహ్లోట్ (27)ను రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లా బలోత్రాలో అరెస్ట్ చేశారు. గహ్లోట్.. భార్య, ఆమె ప్రేమికుడు కలిసి ఈ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. భార్య తన భర్త రొటీన్ వివరాలను వారికి అందించి ఈ నేరానికి సహకరించినట్లు తెలిపాడు. దొంగిలించిన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. ప్రేమికుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Next Story