- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక మోసం కేసులో ఐపీఎస్ అధికారిణి భర్త అరెస్ట్
మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారిణి రష్మీ కరాండికర్ భర్త పురుషోత్తం చవాన్‌పై మరోసారి ఆర్థిక మోసాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారిణి రష్మీ కరాండికర్ భర్త పురుషోత్తం చవాన్‌పై మరోసారి ఆర్థిక మోసాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబైకి చెందిన ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు తాజాగా రూ.7.42 కోట్ల మోసం కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఇదివరకే ఆయన మరో కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, తాజాగా ఈ కొత్త కేసు కూడా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు చవాన్.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారితో పాటు మరికొంతమందిని ప్రభుత్వ కోటాలో తక్కువ ధరలకు ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మబలికి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాక.. మహారాష్ట్ర పోలీస్ అకాడమీ(Maharashtra Police Academy)కి టీ షర్టుల సరఫరా టెండర్‌ను దక్కేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
బాధితుల ఫిర్యాదులు, ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈఓడబ్ల్యూ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. దాంతో.. చవాన్ గతంలో కూడా ఇలాంటి స్కీములతో ప్రజలను మోసగించి, రూ.24 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు.
ఈ నకిలీ హామీలతో ముంబై, పుణే, థానే వంటి నగరాల్లో ప్రభుత్వ ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి పలువురిని నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు గత కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజా కేసులో విచారణ నిమిత్తం పోలీసుల కస్టడీకి తరలించబడ్డారు.






