గుడికి తీసుకెళ్లి భార్యను అతికిరాతకంగా హతమార్చిన భర్త.. అక్రమ సంబంధమే కారణమా??

by Sujitha Rachapalli |

యూపీలో దారుణం చోటు చేసుకుంది. గుడికి తీసుకెళ్లి భార్యను అతికిరాతకంగా చంపాడు భర్త. బరేలీకి చెందిన ఓంశరణ్ మౌర్య.. భార్య అమరావతిని తీసుకుని.. ఉత్తరాఖండ్‌లోని పుర్ణగిరి దేవి ఆలయానికి వెళ్లి వద్దామని తీసుకెళ్లాడు. దర్శనం జరిగాక.. అమరావతి పుట్టింటికి కూడా వెళ్లారు.

గుడికి తీసుకెళ్లి భార్యను అతికిరాతకంగా హతమార్చిన భర్త.. అక్రమ సంబంధమే కారణమా??
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. గుడికి తీసుకెళ్లి భార్యను అతికిరాతకంగా చంపాడు భర్త. బరేలీకి చెందిన ఓంశరణ్ మౌర్య.. భార్య అమరావతిని తీసుకుని.. ఉత్తరాఖండ్‌లోని పుర్ణగిరి దేవి ఆలయానికి వెళ్లి వద్దామని తీసుకెళ్లాడు. దర్శనం జరిగాక.. అమరావతి పుట్టింటికి కూడా వెళ్లారు. రాత్రి అయింది.. జర్నీ మంచిది కాదని.. తెల్లారాక వెళ్లండి అని చెప్పినా.. వినకుండా భార్యతో ఇంటికి బయలుదేరాడు. గ్రంథి గ్రామం సమీపంలోకి వచ్చాక భార్యపై కత్తితో ఎటాక్ చేశాడు. దారుణంగా హతమార్చాడు. తన ఒంటిపై కూడా చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. తమపై దొంగలు ఎటాక్ చేశారని.. ఈ ఘటనలో భార్య చనిపోయిందని కవరింగ్ ఇచ్చాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించాడు. భార్య చనిపోయేలా గాయాలు ఉండటం.. భర్తకు స్వల్ప గాయాలు మాత్రమే ఉండటంతో పోలీసులకు అతనిపై అనుమానం పెరిగింది. తమ స్టైల్‌లో విచారిస్తే.. అసలు విషయం బయటపడింది. అమరావతిని పెళ్లి చేసుకున్నాక కూడా ఓం శరణ్.. మరో మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మొదటి భార్యను తొలగించాలని అప్పుడే తనతో కాపురం చేస్తానని రెండో భార్య షరతు పెట్టడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నాడు భర్త.


Next Story