Viral news: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. ఊహించని ట్విస్ట్

by Yella Dhawani Reddy |

పెళ్లి పీటల మీద నుంచి వధువు పారిపోవడం..

Viral news: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. ఊహించని ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి పీటల మీద నుంచి వధువు పారిపోవడం.. కాసేపట్లో పెళ్లి అనగా వరుడు ట్విస్ట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో అనేకం చూస్తున్నాం. అయితే, పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేయడమో, ఆల్రెడీ వారు వేరే రిలేషన్‌లో ఉండటం కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కానీ, ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమించి, అతడితోనే ఉంటానని చెప్పడంతో.. తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. యూపీలో (Uttar Pradesh) ఇటీవల చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె తన ప్రియుడిని వదిలేసి మళ్లీ మొదటి భర్త చెంతకే చేరింది. అసలేం జరిగిందంటే?

యూపీలోని సంత్ కబీర్‌ నగర్‌‌లోని కతార్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూకి ( Bablu ) 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికతో ( Radhika ) పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, బబ్లూ జీవనోపాధి కోసం మరో చోట పని చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో రాధిక అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో ప్రేమాయణం సాగించింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త బబ్లూకు కూడా తెలియడంతో రాధికను మందలించాడు. కానీ, ఆమె దానికి అంగీకరించకపోగా ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో బబ్లూ దగ్గరుండి వారిద్దరికి పెళ్లి జరిపించాడు.

అయితే, ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని వికాస్ ఇంటికి వెళ్లిన రెండు రోజులకే రాధిక తిరిగి మొదటి భర్త బబ్లూ దగ్గరికి తిరిగి వచ్చేసింది. భార్యకు దూరమై పిల్లల్ని పెంచేందుకు బబ్లూ పడుతున్న ఇబ్బందులను వికాస్ తల్లి అతడికి వివరించింది. దీంతో వికాస్ రాధికను తిరిగి బబ్లూ వద్దకు పంపాడు. తన చెంతకు మళ్లీ వచ్చిన భార్యను మనస్పూర్తిగా స్వీకరిస్తానని బబ్లూ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు.

Next Story