భార్యను నరికి చంపిన భర్త.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-27 03:02:21  IST  )

కర్ణాటక రాష్ట్రంలోని మాగడి సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

భార్యను నరికి చంపిన భర్త.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా మారుతున్న జీవన శైలిలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రోజు రోజుకీ భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. ఓర్పు, సహనం తగ్గిపోవడం, పరస్పర గౌరవం లేకపోవటం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి క్షణికావేశ నిర్ణయాలతో ప్రాణాలు తీసుకునే ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన వెలుగుచూసింది. వంట విషయంలో ఏర్పడిన చిన్న గొడవ ఓ భార్య ప్రాణాలే కోల్పోయేలా చేసింది.

కర్ణాటకలోని బెంగళూరు (Bangalore) గ్రామీణ జిల్లా పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మాగడి సమీపంలో ఉన్న మత్తికెరె గ్రామంలో 65 ఏళ్ల తిమ్మమ్మను, ఆమె భర్త రంగయ్య (68) అతి దారుణంగా నరికి చంపేశాడు. బుధవారం రాత్రి వారి ఇద్దరి మధ్య వంట చేసే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుని, తీవ్ర గొడవకు దారితీసింది. దీంతో ఆవేశానికి గురైన రంగయ్య వంటగదిలోని కొబ్బరి తురిమే పీటతో భార్య తిమ్మమ్మపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నేరం నుంచి తప్పించుకునేందుకు రంగయ్య తిరుపతికి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం రామనగరలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భార్య ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Next Story