- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్లుగా భార్య రక్తం తాగుతున్న భర్త.. ప్రెగ్నెంట్ టైమ్‌లో కూడా వదలని దుర్మార్గుడు.. గ్రామస్తులంతా ఒకటై...
మధ్య ప్రదేశ్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. దీపా అహిర్వార్.. తన భర్త మహేష్ అహిర్వార్‌ను పెళ్లి చేసుకుంది. ముందు బాగానే ఉన్నా.. కొన్న నెలల తర్వాత భర్త దుర్మార్గం మొదలైంది. వ్యవసాయ కూలీ అయిన మహేష్.. పని చేసి వచ్చాక.. పడుకునే ముందు రోజూ భార్య

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. దీపా అహిర్వార్.. తన భర్త మహేష్ అహిర్వార్‌ను పెళ్లి చేసుకుంది. ముందు బాగానే ఉన్నా.. కొన్న నెలల తర్వాత భర్త దుర్మార్గం మొదలైంది. వ్యవసాయ కూలీ అయిన మహేష్.. పని చేసి వచ్చాక.. పడుకునే ముందు రోజూ భార్య రక్తం తాగడం మొదలుపెట్టాడు. ఆమె రక్తాన్ని సిరంజితో తీసి.. గ్లాసులో పోసుకుని తాగేవాడు. వద్దంటే.. కొట్టి మరీ.. తను చేయాల్సింది చేసేవాడు. ఇలా మూడేళ్లు సాగింది. ఆ తర్వాత దీప ప్రెగ్నెంట్ అయినా కూడా ఇదే దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె శారీరకంగా, మానసికంగా మరింత బలహీనంగా మారిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారితో కలిసి పోలీసు కేసు పెట్టేందుకు వెళ్లింది. కానీ వారు ముందుగా పట్టించుకోలేదు.
దీంతో శిఖర్‌పురియా గ్రామం మొత్తం ఏకమైంది. బాధితురాలి తరపున నిలబడింది. పోలీసు కేసు పెట్టి.. అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. ఆమెకు సపోర్టుగా నిరసన ర్యాలీలు చేపట్టారు. దీంతో హిండోరియా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ కేసులో మహేష్ తండ్రి, బావ కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన 2011లో జరగ్గా ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది.






