- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: రెండో మరదలిని కూడా నాకే ఇచ్చి పెళ్లి చేయండి.. భార్య చెల్లితో పెళ్లి కోసం టవరెక్కిన భర్త
తన భార్య చెల్లితో పెళ్లి కోసం ఓ వ్యక్తి టవర్ ఎక్కిన ఘటన వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాలం మారుతున్న కొద్ది సమాజంలో విలువలు పతనం అవుతున్నాయి. ప్రేమ, పెళ్లి అనే పదాలకు అర్థాలు మారిపోతున్నాయి. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించే వారు కొందరైతే కోరుకున్న వారిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడేవారు మరికొందరు కనిపిస్తున్నారు. తాజాగా యూపీలో (Uttar Prades) ప్రేమ పేరుతో ఓ వ్యక్తి చేసిన పని అందరిని షాక్ కు గురి చేసింది. అతడి డిమాండ్ విని పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. తన భార్య చెల్లిని సైతం తనకే ఇచ్చి పెళ్లి చేయాలని అతను పట్టుబట్టడం అందరినీ విస్తుపోయేలా చేసింది. దాదాపు ఏడు గంటల పాటు టెన్షన్ పెట్టించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
మరదలి కోసం టవరెక్కి:
ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ కు (Kannauj) చెందిన రాజ్ సక్సేనాకు 2021 లో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన ఏడాదికే అనారోగ్యం కారణంగా భార్య చనిపోయింది. దాంతో కూతురు చనిపోయిందన్న బాధ దిగమింగుకుని తమ రెండో అమ్మాయిని సైతం రాజ్ కే ఇచ్చి అత్తామామలు పెళ్లి చేశారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ రాజ్ దృష్టి తన భార్య చెళ్లిపై పడింది. దీంతో మీ మూడో కూతురిని కూడా నేనే పెళ్లి చేసుకుంటానంటూ రాజ్ తన మనసులోని మాటను అత్తమామలకు వివరించాడు. అల్లుడి మాటలకు షాక్ తిన్న అత్తమామలు ఇందుకు నిరాకరించారు.
నన్నే కాదంటారా..
ఓ వైపు తన భార్య బతికుండగానే తన మరదలిని పెళ్లిచేసుకోవాలని భావించిన రాజ్ సక్సేనా (Raj Saxena) గురువారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తన మరదిలిని ఇచ్చి పెళ్లి చేయాలని లేదంటే దూకి చనిపోతానని బెదిరించాడు. ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో చేసేదేమి లేక చివరకు తమ మూడో కూతురిని కూడా అతడికే ఇచ్చి వివాహం చేయడానికి అత్తమామలు అంగీకరించారు. దాంతో ఎట్టకేలకు పట్టు వీడి టవర్ దిగి రాజ్ కిందకు వచ్చాడు. కిందకు వచ్చాక అతడు మాట్లాడుతూ తన మరదలికి కూడా తానంటే ఇష్టమేనని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






