- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ.. వీడసలు మనిషేనా? సొంత భార్య ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్
బట్టతల ఉందనే విషయం దాచి పెళ్లి చేసుకోవడమే కాకుండా భార్య ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయిన వారే నట్టేట ముంచుతున్నారు. జీవితాంతం తోడుగా, అండగా ఉంటాడని నమ్మిన పాపానికి ఓ మహిళకు కట్టుకున్న భర్తే కీచకుడిగా (Husband Harassment) మారాడు. బట్టతల ఉందన్న విషయాన్ని దాచి పెళ్లి చేసుకోవడమే కాకుండా సొంత భార్య ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్‍కు (Private Photos Blackmail) తెగబడ్డాడు. అంతటితో తన కుటుంబ సభ్యులతో కలిసి కట్టుకున్న భార్యను వేధింపులకు పాల్పడ్డాడు. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ వధువుకు అక్కడ ఎదురైన అనుభాలను తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాలో (Greater Noida) జరిగిన ఈఘటనకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి.
బట్టతల విషయాన్ని దాచి:
న్యూఢిల్లీలోని ప్రతాప్ బాగ్‍లో నివసిస్తున్న వ్యక్తితో తనకు వివాహం జరిగిందని అయితే పెళ్లికి ముందు అతడికి బట్టతల ఉందనే విషయాన్ని నాకు నా కుటుంబ సభ్యులెవరికి తెలియకుండా విగ్ తో దాచిపెట్టాడని సదరు మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కంది. పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్లాక అక్కడ అతడి బట్టతల స్వరూపం బయటపడిదంని పేర్కొంది. ఈ మోసాన్ని తాను ప్రశ్నించగా తన భర్తతో పాటు అత్తమాల ప్రవర్తన సైతం తన పట్ల మారిపోయిందని పేర్కొంది. ఈ క్రమంలో తన భర్త ఆయన సెల్ ఫోన్‍లో నా ప్రైవేట్ ఫోటోలు తీసుకున్నాడని ఆ ఫోటోలను చూపించి డబ్బులు ఇవ్వకపోతే వాటిని బయటపెడతానని బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించింది.
ఆభరణాలు లాగేసుకుని..
తన అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన భర్త మానసికంగా, శారీరకంగా వేధించాడని తన వద్ద ఉన్న రూ. 15 లక్షల విలువైన ఆభరణాలను బలవంతంగా తీసుకుని ఆ తర్వాత కన్ని రోజులకు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపించింది. ఈ ఘటన తర్వాత పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిస్కాఖ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఫోటోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.






