పోలీసుల ముందే.. భర్తను చితగ్గొట్టిన భార్య.. (వీడియో)

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌ లలిత్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పోలీసుల ముందే భర్తను చితగ్గొట్టింది. దాదాపు పది నిమిషాలు జుట్టు పట్టి కొట్టిన ఆమె..

పోలీసుల ముందే.. భర్తను చితగ్గొట్టిన భార్య.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : భర్తలపై దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కో ఎటాక్ చూస్తుంటే షాకింగ్‌గా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ లలిత్‌పూర్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పోలీసుల ముందే భర్తను చితగ్గొట్టింది. దాదాపు పది నిమిషాలు జుట్టు పట్టి కొట్టిన ఆమె.. పచ్చి బూతులు తిడుతూ చితక బాదింది. మహిళా పోలీసులు లేకపోవడంతో జోక్యం చేసుకోలేక పోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ పగలగొట్టడం.. మద్యం సేవించమని బలవంతం చేయడం.. ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాపం భర్త హెల్ప్‌లెస్‌గా మారాడని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భార్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

VIDEO

Next Story